మీల్ మేకర్ పకోడీ

Durga
మీల్ మేకర్ పకోడీ కి కావలసిన పదార్ధాలు: మీల్‌మేకర్ : 100గ్రా  కార్న్‌ఫ్లోర్ :1/2 కప్పు  బియ్యంపిండి : 1/2 కప్పు  శనగపిండి : 1/2 కప్పు  ఉల్లిపాయలు : 2  నిమ్మకాయ : 1  కొత్తిమీర : కొద్దిగా  కరివేపాకు : కొద్దిగా  నూనె : సరిపడ  ఉప్పు, కారం : సరిపడ  అల్లంవెల్లుల్లి పేస్టు : 2 స్పూన్స్ మీల్ మేకర్ పకోడీ తయారు చేసే విధానం: ముందుగా ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లుపోసి మరిగించుకోవాలి. అందులో మీల్‌మేకర్ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వీటిని 10 నిమిషాలు నీళ్లలోనే ఉంచి, తరువాత వేరే పాత్రలోకి మీల్‌మేకర్‌ని తీసుకుని మెత్తగా చేయాలి. అందులో కార్న్‌ఫ్లోర్, బియ్యంపిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగాక పకోడీల మాదిరిగా వేసుకుని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంతే కర కరలాడే మీల్ మేకర్ పకోడీ రెడీ, వీటిని టొమాటో సాస్ తో తింటే చాల రుచిగా ఉంటాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: